కశ్మీర్ బోర్డర్ గ్రామాలపై పాక్ బాంబులు : ముగ్గురు మృతి

కశ్మీర్ బోర్డర్ గ్రామాలపై పాక్ బాంబులు : ముగ్గురు మృతి

కశ్మీర్ సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. ఎయిర్ ఫోర్స్  పైలట్  అభినందన్  వర్ధమాన్ ను అప్పగించిన కొన్ని గంటల్లోనే బార్డర్లో కాల్పులకు తెగబడ్డారు పాక్ రేంజర్లు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. రాత్రి సరిహద్దులోని పూంచ్ జిల్లా కృష్ణా ఘాటి సెక్టార్ లోని… సాలోత్రి గ్రామంలో జరిగిన బాంబులు విసిరారు పాక్ రేంజర్లు. ఈ దాడిలో ఓ ఇల్లు ధ్వంసమైంది. ఓ మహిళతో పాటు, ఆమె ఐదేళ్ల కొడుకు, 9 నెలల కూతురు చనిపోయింది. కాల్పుల్లో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. 105 MM, మోర్టార్ బాంబులతో పాక్ దళాలు కాల్పులు జరిపినట్టు స్థానికులు చెప్తున్నారు.