భానుర్ లో వలసకూలీల ఆత్మహత్య

భానుర్ లో వలసకూలీల ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం భానుర్ లో ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివాహిత తన చిన్నారితో సహా వరుసకు మరిదైన ఓ యువకుడితో కలిసి ముగ్గురు అనుమానాస్పదంగా ఉరివేసుకొని మృతి చెందారు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే ఈ ముగ్గురూ కూడా ఒకే చున్నీకి ఉరి వేేసుకొని చనిపోయినట్టు.. అక్కడి సన్నివేశాన్ని చూస్తే తెలుస్తోంది. ఇక ఈ మృతి చెందిన బసుదేవ్ కుసుబ( 27), రేఖ( 28), సోనమ్( 2) లు మధ్యప్రదేశ్ కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యలపై పలు అనుమానాలు  రావడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు BDL భానుర్ పోలీసులు తెలిపారు.