ఒకే కుటుంబంలో ముగ్గురిని కాటేసిన పాము

ఒకే కుటుంబంలో ముగ్గురిని కాటేసిన పాము

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసింది. ఈ ఘటనలో మూడు నెలల చిన్నారి మృతి చెందగా తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారి తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉంది.  ఇంట్లో నిద్రపోతుండగా పాపను పాము కాటేసింది. పాప ఏడవడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏమైందోనని చూస్తుండగా వారిని కూడా పాము కరిచింది. దీంతో వెంటనే చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి చనిపోయింది. మరోవైపు  పాప తల్లిదండ్రుల  పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి చికిత్స అందిస్తున్నారు.  మూడనెలలకే పాపకు నిండు నూరేళ్లు నిండాయంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.