ఏపీలో మూడు సార్లు ఉచితంగా రేషన్

ఏపీలో మూడు సార్లు ఉచితంగా రేషన్

లాక్‌డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు మూడుసార్లు ఉచిత రేషన్ సరుకులు అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇవాళ(శనివారం) ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మార్చి 29 (ఆదివారం)న రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కేజీ కంది పప్పు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. రెండో విడతగా ఏప్రిల్‌ 15న బియ్యం, కేజీ కందిపప్పును పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 29న మూడోసారి ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆహారభద్రతా పథకంలో లేని కార్డులకూ రాష్ట్రం బియ్యం, కేజీ కందిపప్పు ఇవ్వనుంది.  దీనికోసం అదనపు ఖర్చును రాష్ట్రం భరించనుంది.

ఏప్రిల్‌ 1న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా లబ్దిదారులు అందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు సీఎం జగన్. ఏప్రిల్‌ 4వ తేదీన నిరుపేదలకు రూ.1,000 చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు. గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్లను డోర్ డెలివరీ చేయనున్నట్లు తెలిపారు.