
బషీర్ బాగ్, వెలుగు: డ్యూటీలో ఉన్న హోంగార్డుపై దాడి చేసిన వ్యక్తికి మూడేండ్ల జైలు శిక్ష , 2 వేల ఫైన్ విధించింది. 2018లో శివలింగం అనే హోంగార్డు డ్యూటీకి ప్రదీప్ (27) ఆటంకం కలిగించడమే కాకుండా దాడి చేసి గాయపరిచాడు. అప్పటి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శంకర్ రాజు ఫిర్యాదుతో సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం నాంపల్లి కోర్టు నిందితుడు ప్రదీప్ కు మూడేండ్ల జైలు శిక్షతో పాటు, జరిమానా విధించినట్లు సుల్తాన్ బజార్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసచారి తెలిపారు.