రాహుల్ గాంధీతో తుమ్మల భేటీ.. ఖమ్మం టికెట్ ఖరారు?

రాహుల్ గాంధీతో  తుమ్మల  భేటీ.. ఖమ్మం టికెట్ ఖరారు?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.  కేసి వేణుగోపాల్ పిలుపు మేరకు  2023 అక్టోబర్14న ఢిల్లీలో  తుమ్మల నాగేశ్వరరావు  రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో తుమ్మలకు ఖమ్మం టికెట్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.   పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా తుమ్మల  రాహుల్ తో  సమావేశమయ్యారు.   ఈ సందర్భంగా  ఖమ్మంలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైచర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉన్న రాజకీయ విషయాలను కూడా చర్చించినట్లు సమాచారం.

Also Read : ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంట్ గా ఉన్నావ్.. పెళ్లి చూపులు ఇలా కూడానా..!

కాగా,  తుమ్మల నాగేశ్వరరావు  కమ్మ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. తెలంగాణలో కమ్మ సామాజిక ఓట్లు 25 లక్షలు ఉన్నాయి. 2009 లో , 2014 , 2018 లలో ఖమ్మం నియోజక వర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుపొందారు. 2009 లో తుమ్మల టిడిపి పార్టీ తరుపున ఖమ్మం నుంచి గెలుపొందగా, 2014 లో పువ్వాడ అజయ్ కాంగ్రెస్ తరుపున గెలుపొందారు. 2018లో హస్తం గుర్తు లేకపోవటంతో అజయ్ కు కలిసి వచ్చింది. ఈ దఫా తుమ్మల హస్తం గుర్తుపై పోటి చేయనున్నారు.