
హైదరాబాద్, వెలుగు: ఎంటర్‌ప్రెన్యూర్లకు మద్దతు ఇవ్వడానికి "సబ్ కుచ్ టైడ్ పర్" పేరుతో ఒక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు టైడ్కంపెనీ ప్రకటించింది. ఇది భారతదేశం నలుమూలల ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్లకు ఉపయోగపడుతుంది.
ఈ బిజినెస్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫారమ్ ఎంటర్‌ప్రెన్యూర్లు తమ వ్యాపారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి, అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన డిజిటల్ పరిష్కారాలను ఒకే చోట అందిస్తుంది.
మొబైల్ యాప్‌తోనే నగదు నిర్వహణ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, పేమెంట్స్ వంటి పనులు చేసుకోవచ్చు. ఉద్యమ్ పోర్టల్‌లో తమ వ్యాపారాన్ని రిజిస్టర్ చేయవచ్చు. జీఎస్టీ కోసం దరఖాస్తు చేయవచ్చు. యూపీఐ మనీ ట్రాన్స్ఫర్స్, బిల్స్పేమెంట్స్ వంటి పనులూ చేసుకోవచ్చు.