TikTok Layoffs: ఉద్యోగులకు టిక్ టాక్ బిగ్ షాక్..వెయ్యిమంది తొలగింపు

TikTok Layoffs: ఉద్యోగులకు టిక్ టాక్ బిగ్ షాక్..వెయ్యిమంది తొలగింపు

TikTok Layoffs: ప్రపంచ వ్యాప్తంగా  1000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్ల టిక్ టాక్ మంగళవారం (మే 21) ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేం దుకు కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను దశలవారీగా తొలగించనున్నట్టు తెలిపింది.

ఇటీవల టిక్ టాక్ మాతృసంస్థ అయిన బైట్ డాన్స్ అమెరికా ప్రభుత్వం నుంచి ఒత్తిడి కారణంగా తన వర్క్ ఫోర్స్ ను తగ్గించుకుంటుందని తెలుస్తోంది. టిక్ టాక్ ను ఓ అమెరికన్ కంపెనీకి విక్రయిచకపోతే దాని పై నిషేధానికి హౌస్ బిల్లుపై జో బైడెన్ సంతకం చేశారు. దీంతో బైట్ డాన్స్ పై ఒత్తిడి ఎక్కువయింది. ఈ క్రమంలో కంపెనీ లేఆఫ్స్ ప్రకటించింది. 

టిక్ టాక్ కంటెంట్, మార్కెటింగ్ విభాగాల్లోని ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని  తెలుస్తోంది. టిక్ టాక్ దాని గ్లోబల్ యూజర్ ఆపరేషన్స్ టీమ్ ను రద్దు చేయాలని చూస్తోంది. ఈ టీం కస్టమర్లకు సపోర్ట్, కమ్యూనికేషన్ ను నిర్వహిస్తోంది. మిగతా ఉద్యోగులన సెక్యూరిటీ, మార్కెటింగ్, కంటెంట్, ప్రాడక్ట్ టీంలలో తిరిగి కేటాయిం చబడతారని కంపెనీ తెలిపింది. 

టిక్ టాక్ 2023నాటికి 7వేల మంది ఉద్యోగులు,..150 మిలియన్ల అమెరికన్ కస్టమర్లను కలిగి ఉంది. టిక్ టాక్ కు యూఎస్ మార్కెట్ చాలా కీలక మైనది. 2023లో దాని 20 బిలియన్ డాలర్ల ఆదాయంలో 80 శాతం వాటా యూఎస్ కలిగి ఉంది.