రాజ్‌కోట్: స్టార్ బ్యాటర్, కెప్టెన్ తిలక్ వర్మ (118 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 109) సెంచరీతో ఆదుకోవడంతో విజయ్ హజారే వన్డే ట్రోఫీలో హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత శనివారం జరిగిన గ్రూప్–బి మ్యాచ్‌లో 136 రన్స్ తేడాతో చండీగఢ్‌ను ఓడించింది. టోర్నీలో బరిలోకి దిగిన తన తొలి పోరులోనే తిలక్ బ్యాటింగ్‌ను ముందుండి నడిపించడంతో హైదరాబాద్ 50 ఓవర్లలో 286/9 స్కోరు చేసింది. అభిరథ్ రెడ్డి (71) కూడా రాణించాడు.
అనంతరం ఛేజింగ్‌లో చండీగఢ్ 37.4 ఓవర్లలో 150 రన్స్‌కే ఆలౌటైంది. సన్యమ్ సైని (46) టాప్ స్కోరర్. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి మూడు, నితేశ్ రెడ్డి, సీవీ మిలింద్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఓ వికెట్ తీశాడు. తిలక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మంగళవారం జరిగే తర్వాతి మ్యాచ్‌లో బెంగాల్‌తో
హైదరాబాద్ పోటీ పడనుంది.
