Tim David: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) హిట్టర్ టిమ్ డేవిడ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఐపీఎల్ 2026 సీజన్ అంతా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచిన డేవిడ్.. ఆర్‌సీబీ టైటిల్ గెలిచిన ఆనందంలో కొంచెం ఓవరాక్షన్ చేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం గ్రౌండ్‌లోనే అతను సిగార్ (చుట్ట) కాలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా క్రికెట్ కల్చర్‌లో టైటిల్ గెలిచాక సిగార్ కాల్చడం ఒక ట్రెడిషన్ అయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం దీనిపై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్‌లో కూడా అతను ఫిల్ సాల్ట్‌తో కలిసి నోట్లో సిగార్ పెట్టుకుని ట్రోఫీ పట్టుకున్న ఫోటోలను షేర్ చేశాడు.
టిమ్ డేవిడ్ తీరుపై ఐపీఎల్ రూల్స్:
వీడియో వైరల్ అవ్వడంతో డేవిడ్‌పై ఐపీఎల్ యాజమాన్యం ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా అనే డౌట్ అందరిలోనూ మొదలైంది. అయితే.. టిమ్ డేవిడ్‌కు జరిమానా పడే ఛాన్స్ చాలా తక్కువ అని తెలుస్తోంది. మ్యాచ్, ప్రెజెంటేషన్ సెర్మనీ పూర్తిగా ముగిసిపోయిన తర్వాత జరిగే సెలబ్రేషన్స్‌లో.. ఆటగాళ్లు సిగార్ కాల్చకూడదనే స్పష్టమైన రూల్ ఐపీఎల్ నిబంధనల్లో ఎక్కడా లేదు. ఇది ఆట జరుగుతున్న సమయంలో మైదానంలో చేసిన పని కాదు కాబట్టి, స్టేడియం లేదా కమర్షియల్ రూల్స్ బ్రేక్ అయితే తప్ప దీనిపై బోర్డు చర్యలు తీసుకునే ఛాన్స్ లేదు..
రియాన్ పరాగ్‌పై ఎందుకు ఫైన్?:
ఇదే సీజన్ మొదట్లో రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేప్ (Vape) కాలుస్తూ కెమెరాకు దొరికిపోవడంతో అతని మ్యాచ్ ఫీజులో 25% ఫైన్ వేశారు. కానీ అది మ్యాచ్ జరుగుతున్న సమయంలో జరిగింది, టిమ్ డేవిడ్ చేసింది మ్యాచ్ మొత్తం అయిపోయాక కాబట్టి రెండింటికీ చాలా డిఫరెన్స్ ఉంది.
ఈ సీజన్‌లో హాట్రిక్ కాంట్రవర్సీలు:
సిగార్ మ్యాటర్‌లో సేఫ్ అయినా.. ఈ సీజన్‌లో టిమ్ డేవిడ్ డిసిప్లిన్ ట్రాక్ రికార్డ్ ఏమాత్రం బాగోలేదు.. అతను ఆల్రెడీ ఈ మూడు వివాదాల్లో చిక్కుకున్నాడు.
* ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్: ఈ మ్యాచ్‌లో మైదానంలోనే ఒక అసభ్యకరమైన సైగ (Obscene Gesture) చేసి ఫైన్ కట్టాడు.
* ఐపీఎల్ 2026 ఫైనల్: ఫైనల్ మ్యాచ్ ముగిశాక ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించినందుకు టిమ్ డేవిడ్‌పై ఒక మ్యాచ్ బ్యాన్ విధించడమే కాకుండా.. అతని మ్యాచ్ ఫీజులో 50శాతం జరిమానా కూడా విధించారు.
* లేటెస్ట్ సిగార్ వివాదం: ఇప్పుడు గ్రౌండ్‌లోనే సిగార్ కాలుస్తూ నెటిజన్ల ట్రోలింగ్‌కు గురవుతున్నాడు.
TIM DAVID LITERALLY SMOKING INFRONT OF 15 YEARS OLD VAIBHAV SURYAVANSHI 🤦 https://t.co/Gut3XmzzOa
— Sam (@cricsam02) June 3, 2026
