Survey: యూపీలో అధికారం ఏ పార్టీదంటే

Survey: యూపీలో అధికారం ఏ పార్టీదంటే

5 రాష్ట్రాల ఎన్నికలపై టైమ్స్ నౌ సంస్థ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందని తెలిపింది. సమాజ్ వాది పార్టీ గతం కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించింది. ఇక బహుజన సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ కు యూపీలో గడ్డుపరిస్థితులే ఉంటాయని టౌమ్స్ నౌ సర్వే తేలింది. యోగి ఆదిత్యనాథ్  మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ 53.4 శాతం మంది కోరారని.. అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి కావాలంటూ 31.5 శాతం మంది కోరితే.. ప్రియాంక గాంధీ యూపీ ముఖ్యమంత్రిగా ఉండాలంటూ 2.5 శాతం మంది కోరినట్లు తెలుస్తోంది. యూపీలో బీజేపీ సొంతంగా 227 నుంచి 254 స్థానాలు గెలవబోతుందని సర్వే తెలిపింది. 

ఇక పంజాబ్ లో ఆమ్ ఆద్మి పార్టీకి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయని తెలిపింది. ఆ పార్టీ నేత భగవంత్ మాన్ ను తదుపరి ముఖ్యమంత్రిగా చూస్తున్నారని సర్వేలో తేలింది. ఆమ్ ఆద్మీకి 54 నుంచి 58సీట్లు రాబోతున్నాయని తెలిపింది. కాంగ్రెస్ కు 41 నుంచి 47 సీట్లు ఛాన్స్ ఉంటే.. బీజేపీ మాగ్జిమమ్ మూడు సీట్లు సాధిస్తుందని సర్వే తెలిపింది. ఉత్తరాఖండ్ లో బీజేపీకి ఛాన్స్ ఉందని తెలిపింది. ఆ పార్టీ 44 నుంచి 50 సీట్లు గెలువబోతుందని తెలిపింది. కాంగ్రెస్ కు 12 నుంచి 15 సీట్లు వస్తాయని తెలిపింది.  బీజేపీ నేత పుష్కర్ సింగ్ ధామి పవర్ ఫుల్ నేతగా ఉత్తరాఖండ్ ప్రజలు చూస్తున్నారని టౌమ్స్ నౌ ప్రకటించింది. గోవాలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని.. ప్రమోద్ సావంత్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు బీజేపీకి కొంత మైనస్ గా మారనున్నాయని తెలిపింది. బీజేపీకి 17 నుంచి 21 సీట్లు రాబోతున్నట్లు తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ 8 నుంచి 11 స్థానాల్లో విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ సర్వే ప్రకటించింది.