
వీకెండ్ కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు నిండి టీబీసీ వరకు భక్తులు బయట క్యూలైన్లలో ఉన్నారు. దీంతో టికెట్ లేని శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 36 గంటల సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
మరోవైపు మార్చి 18న 75, 452 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 39,262 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా.. హుండీ ఆదాయం 4.05 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.