తిరుమల అలిపిరి మెట్లపై తిరుగుతున్న ఎలుగు బంటి.. భయంలో భక్తులు

తిరుమల అలిపిరి మెట్లపై తిరుగుతున్న ఎలుగు బంటి.. భయంలో భక్తులు

గత కొన్ని రోజులుగా తిరుమల పరిసర ప్రాంతాల్లో వన్య మృగాలు హల్ చల్ చేస్తున్నాయి. తిరుమలలో క్రూర మృగాల సంచారం భక్తులను భయాందోళనలకు గురిచేస్తోంది. తిరుమలకు రావాలంటేనే గజగజ వణికిపోతున్నారు. తాజాగా తిరుమల అలిపిరి నడకదారిలోని ఏడుమైళు వద్ద ఎలుగుబంటు కలకలం రేపింది. నరసింహస్వామి ఆలయం సమీపంలో‌ ఎలుగుబంటి సంచరించింది. ఎలుగుబంటిని చూసి భక్తులు ఒక్కసారిగా పరుగులు తీశారు. 

వెంటనే అక్కడి అధికారులకు భక్తులు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు మైకుల్లో ప్రకటన చేసి.. నడక దారిలో వస్తున్న మిగతా భక్తులను అప్రమత్తం చేశారు. ఎలుగుబంటి తిరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఎలుగుబంటిని బంధించిచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

అయితే తిరుమలలో ఎప్పటికప్పుడు జంతువుల సంచారాన్ని గుర్తిస్తున్నామని.. ఈ మేరకు నడకదారిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అటవీశాఖ అధికారులు తెలిపారు.