శిలాతోరణం వరకు భక్తులు.. దర్శనానికి 24 గంటల సమయం

శిలాతోరణం వరకు భక్తులు.. దర్శనానికి 24 గంటల సమయం

తిరుమలకు భక్తులు పోటెత్తారు.  శ్రీవారి దర్శనానికి  భక్తులు భారీగా తరలివచ్చారు. సెప్టెంబర్ 2వ తేదీ శ్రావణ మాసం రెండవ శుక్రవారంతో పాటు వీకెండ్ కావడంతో భక్తులు సంఖ్య పెరిగింది. శ్రీవారి భక్తులతో  వైకుంఠ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు   నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.  దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 24  గంటల సమయం పడుతోంది. 

మరోవైపు టైమ్ స్లాట్ టోకన్ భక్తులకు దర్శనానికి సుమారు  5 గంటల సమయం పుడతోంది. 300 రూపాయల- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మరోవైపు రాఖీ పౌర్ణమి రోజున తిరుమల  శ్రీవారిని 59,808  మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. రాఖీ పండగ రోజు  శ్రీవారికి  25,618 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.