తిరుమల శ్రీవారి భక్తుల కొరకు జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈరోజు (ఏప్రిల్ 24) ఆన్ లైన్ లో విడుదల చేసింది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. భక్తులు ఈ సమయాలను గుర్తుంచుకుని, ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే ఈ వివరాలు జారీ చేయబడినది.

