తిరుమల వెళ్తున్నారా... అయితే ఈ వార్త మీకోసమే

 తిరుమల వెళ్తున్నారా... అయితే ఈ వార్త మీకోసమే

టీటీడీ శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆన్‌లైన్‌లో నవంబర్‌ మాసం టికెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. .రేపు ( ఆగస్టు 22) ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను విడుదల చేయనుంది. రేపు ( ఆగస్టు 22)  మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఎల్లుండి ( ఆగస్టు 23) ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఎల్లుండి ( ఆగస్టు 23) ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనుంది. ఎల్లుండి ( ఆగస్టు 23) మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. 25వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటా విడుదల చేయనుంది. టీటీడీ వెబ్ సైట్ www.tirupatibalaji.ap.gov.in ద్వారా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

ఇక తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం నాడు చాలా తక్కువగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం కేవలం ఒకే ఒక  కంపార్టుమెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం 79వేల444 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.21 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28వేల744 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.