8వ రోజు వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

8వ రోజు వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం 6.55 గంట‌ల‌కు ర‌థోత్సవం ప్రారంభం అయింది. మాడ వీధుల్లో రథంపై శ్రీదేవీ, భూదేవీ సమేత మలయప్ప స్వామి వారు దర్శనం ఇస్తున్నారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనసేవ జరుగనుంది.

Also Read : గోరుముద్దలు పెట్టిన తల్లికి బుక్కెడన్నం పెట్టలేక..

తిరుమలలో  స్వామి వారిని దర్శనానికి చాలా తక్కువ సమయం పడుతోంది. సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. దీంతో సర్వ దర్శనానికి కేవల 3 గంటల సమయం మాత్రమే పడుతోంది. నిన్న 66,598 మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సమర్పించిన కానుకల హుండీ ఆదాయం రూ. 3.88 కోట్లు వచ్చిందని టీటీడీ ప్రకటించింది.