
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయ అర్చకులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అదేరోజు చంద్రగ్రహణం కారణంగా రాత్రి 7 నుంచి జూలై 17వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు ఆలయం తలుపులు మూసివేయనున్నట్టు ఆలయ అధికారులు అధికారిక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులకు, సుపథం ద్వారా 11 సంవత్సరాల లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు, దాతలకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలను జూలై 16వ తేదీ మంగళవారం టీటీడీ రద్దు చేసింది.