టీటీడీ ఆలయాల్లో ఇక నుంచి..ప్రతిరోజూ తిరుపతి లడ్డూ విక్రయం

టీటీడీ ఆలయాల్లో ఇక నుంచి..ప్రతిరోజూ తిరుపతి లడ్డూ విక్రయం

బషీర్ బాగ్, వెలుగు : శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిందని హిమాయత్​నగర్​టీటీడీ టెంపుల్ ఇన్​స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, నిరంజన్ తెలిపారు. ఇక నుంచి ప్రతిరోజూ హైదరాబాద్​నగర భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్లు చెప్పారు.

 ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిమాయత్​నగర్, జూబ్లీహిల్స్​లోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు(టీటీడీ)లో రూ.50కే లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూలు విక్రయించేవారు. ఇక నుంచి ప్రతిరోజూ భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండనుంది.