పల్లెటూరు నేపథ్యంలో కొత్త చిత్రం షురూ

పల్లెటూరు నేపథ్యంలో  కొత్త చిత్రం షురూ

డిఫరెంట్ స్ర్కిప్టులతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటిస్తున్నాడు తిరువీర్.   రీసెంట్‌‌‌‌గా ‘ప్రీ వెడ్డింగ్ షో’తో  సక్సెస్ అందుకుని మంచి జోష్‌‌‌‌లో ఉన్న తను  కొన్ని రోజుల క్రితమే ఐశ్వర్య రాజేష్‌‌‌‌కు జంటగా ఓ చిత్రాన్ని  స్టార్ట్ చేశాడు. తాజాగా  మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌‌‌‌ను మొదలుపెట్టాడు.  ఈ చిత్రానికి మహేందర్ కుడుదుల దర్శకత్వం వహిస్తున్నాడు.  

ఆధ్య మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై   పరుచూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్ర   ముహూర్తపు  సన్నివేశానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ క్లాప్ కొట్టగా,  నిర్మాత  దామోదర ప్రసాద్ కెమెరా స్విచాన్  చేశారు. 

ఫస్ట్ షాట్‌‌‌‌కు దర్శకనిర్మాత  తమ్మారెడ్డి భరద్వాజ  గౌరవ దర్శకత్వం వహించారు.  దర్శకుడు స్వరూప్ మేకర్స్‌‌‌‌కు స్క్రిప్ట్ అందించాడు.  ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.  

పల్లెటూరు నేపథ్యంలో సరదాగా, సందడితో కూడిన ఓ అద్భుతమైన ప్రేమకథగా ఈ  చిత్రం తెరకెక్కనుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.  ఇతర నటీనటులు,  టెక్నిషీయన్స్ వివరాలను  త్వరలో ప్రకటిస్తామన్నారు.