
కొన్ని రోజులుగా ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల భర్తీపై గందరగోళం కనిపిస్తోంది. చాలా దేశాలు ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. దాంతో ఐటీలో రిక్రూట్ మెంట్స్ ఆగిపోయాయి. పెద్ద కంపెనీలు కూడా ఆఫర్ లెటర్స్ ఇచ్చి... ఆన్ బోర్డింగ్ విషయంలో లేట్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీలైతే పని చేస్తున్న ఉద్యోగులను కూడా తొలగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐటీ రంగంలోకి ప్రవేశించే స్టూడెంట్స్ అయోమయంలో ఉన్నారు.
ఐటీ రంగం డౌన్
ఐటీ రంగం డౌన్ అవుతోందని వస్తున్న వార్తలు రూమర్స్ అని తెలంగాణ ఐటీ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ మక్తాల అంటున్నారు. ఐటీ ఎగుమతుల్లో గానీ..సిబ్బంది విషయంలో గానీ ఎక్కడా డౌన్ ట్రెండ్ లేదన్నారు. ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వాళ్ళందరినీ పక్కాగా తీసుకుంటామని ఏ కంపెనీ హామీ ఇవ్వదు. అందువల్ల ప్రెషర్స్ తమ ఆఫర్ లెటర్స్ లో ఎలాంటి కండీషన్స్ ఉన్నాయో చూసుకోవాలన్నారు. కంపెనీ బాండ్లపై సైన్ చేసే ముందు క్రాస్ చెక్ టిటా ప్రెసిడెంట్ సందీప్ చేసుకోవాలని సూచించారు. రిక్రూట్ మెంట్ అనేది ప్రతి ఏడాది లాగే ఉందనీ.. కొత్తగా ఎలాంటి ఇబ్బందుల్లేవన్నారు.
ఐటీ రంగం ఫ్యూచర్
ఐటీ రంగం ఫ్యూచర్ పై ఫ్రెషర్స్ ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని ఐటీ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ప్రస్తుత డిజిటలైజేషన్ లో అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్, హెల్త్ లాంటి రంగాల్లో ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు వస్తున్నాయని సందీప్ తెలిపారు. ఐటీ పీపుల్ కి ఎప్పుడూ పని ఉంటుందని చెప్పారు. కొత్త కొత్త అప్లికేషన్స్ ఎన్నో వస్తున్నాయనీ.. స్టూడెంట్స్ అందుకు తగ్గట్టుగా అప్ డేట్ అవ్వాలని సూచించారు.
ఐటీ సంస్థలు భవిష్యత్ వ్యూహాలు
ప్రపంచ పరిస్థితులను బట్టి ఐటీ సంస్థలు భవిష్యత్ వ్యూహాలు మార్చుకుంటాయన్నారు కంపెనీల నిర్వాహకులు. డెవలప్డ్ కంపెనీల నుంచి కాల్స్ రానప్పుడు.. వేరే వాటిని వెతుక్కోవడంలో తప్పు లేదని డైరీ స్టార్టప్ నిర్వాహకులు వైద్యనాథ్ అన్నారు. ఉద్యోగులు కూడా యేళ్ళ తరబడి ఒకే కంపేనీలో పనిచేయనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తమ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. డెడికేటెడ్ గా పని చేస్తే ఏ కంపెనీ కూడా టాలెంటెడ్ ఎంప్లాయ్ ని వదులుకోదన్నారు.
ఫ్రెషర్స్ ఐటీ రిక్రూట్ మెంట్ లేట్ అవుతోందని బాధ పడకుండా.. దొరికిన ఈ ఖాళీ టైమ్ లో స్కిల్స్ పెంచుకోడానికి ఉపయోగించుకోవాలని ఐటీ ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. డిజిటలైజేషన్ పెరుగుతున్న ఈ టైమ్ లో ఐటీ ఉద్యోగాలు పెరుగుతాయే తప్ప.. తగ్గుతాయన్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచిస్తున్నారు.