ఈ సీజన్ ఐపీఎల్ కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ దుమ్ము రేపుతుంది. కేకేఆర్ తో జరిగిన ఇవాళ్టి మ్యాచ్ లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. గుజరాత్ నిర్ధేశించిన 157 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌ను గెలిపించేందుకు రసెల్ (25 బంతుల్లో 48; ఫోర్, 5 సిక్సర్లు) విఫలయత్నం చేశాడు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రసెల్‌దే అత్యధిక స్కోర్ కాగా, రింకూ సింగ్ (35) పర్వాలేదనిపించాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, యశ్ దయాల్, రషీద్ ఖాన్ తలో వికెట్లు పడగొట్టగా జోసెఫ్, ఫెర్గూసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు హార్ధిక్ పాండ్యా (67) రాణించడంతో గుజరాత్ 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అటు బౌలింగ్ లోనూ..ఇటు బ్యాటింగ్ లోనూ ఆకట్టుకున్న రసెల్ శ్రమ వృధాగా మిగిలిపోయింది.

