మా పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులివ్వండి .. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ను కోరిన ఎమ్మెల్సీ కోదండరాం

మా పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులివ్వండి .. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ను కోరిన ఎమ్మెల్సీ కోదండరాం

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తమ పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను టీజేఎస్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ కోదండరాం కోరారు. మంగళవారం అసెంబ్లీలో మహేశ్ గౌడ్​ను పార్టీ నేతలు పల్లె వినయ్ కుమార్, సర్దార్ వినోద్ కుమార్, ఆశప్ప, శంకర్ రావుతో కలిసి కోదండరాం కలిశారు. 

ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. టీజేఏస్ నేతలు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం ఉద్యమకారులను గౌరవించి ఆదుకుంటుందన్నారు.