
హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు తెలిపింది తెలంగాణ జన సమితి. TRS విధానాలను ఎండగట్టేందుకే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు TJS అధ్యక్షుడు కోదండరామ్. రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో పాలన జరగటం లేదన్నారు. TRS నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని ఆయన.. హుజూర్ నగర్ లో సీపీఐ, సీపీఎం, టీడీపీతో కలిపి ఒకే అభ్యర్థిని నిలబెట్టాలని చూసినా… అది సాధ్యం కాలేదన్నారు. సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వటం సరికాదని… ఇది చారిత్రక తప్పిదంగా నిలిచిపోతుందన్నారు కోదండరామ్.