
హైదరాబాద్, వెలుగు : దీపావళి సెలవును 12కు బదులు 13కు(సోమవారానికి) మార్చాలని టీఎన్జీవో ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం టీఎన్జీవో నేతలు సెక్రటేరియెట్లో సీఎస్ శాంతికుమారిని కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న డీఏలను విడుదల చేయాలని కోరారు. దీపావళి సందర్భంగా ప్రభుత్వం 12న (ఆదివారం) పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది.