తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారమే ఎన్నికలు జరుగుతయ్: సుప్రీం

తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారమే ఎన్నికలు జరుగుతయ్: సుప్రీం

సుప్రీంకోర్టు ధర్మాసనం కేసీఆర్ సర్కార్ పై కీలకమైన కామెంట్స్ చేసింది. తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారమే జరుగుతాయని వ్యాఖ్యానించింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అనర్హుడిగా ప్రకటించేలా నోటీసులు జారీ చేయాలంటూ.. టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్ తరపు న్యాయవాది సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ సందర్భంగా.. రాజాసింగ్ పై అనేక క్రిమినల్ కేసులున్నందున ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు . 

రాజాసింగ్ కు ఇంకా ఏడాది కాలం మాత్రమే పదవి గడువు ఉందని న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారమే జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారించాలంటే అన్ని గ్రహాలు ఒకే వరుసలోకి రావాలని ధర్మాసనం కామెంట్ చేసింది. 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా సుప్రీం గుర్తుచేసింది.