టార్గెట్ వైట్ వాష్‌ : కివీస్ తో భారత్ ఫైనల్ T20

టార్గెట్ వైట్ వాష్‌ : కివీస్ తో భారత్ ఫైనల్ T20

కివీస్ ను వైట్ వాష్ చేసేందుకు టీమిండియాకు రెడీ అయ్యింది. ఫైనల్ పోరులో ఆతిథ్య జట్టుకు లాస్ట్  పంచ్ ఇచ్చేందుకు కోహ్లీసేన ప్లాన్ చేస్తోంది. ఇవాళ ఐదో టీ20లో ఇండియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. మరి టీమ్ భారత్ పాంచ్ పటాకా కొడుతుందా ? లేక  విలియమ్సన్ గ్యాంగ్ ఈ మ్యాచ్ లోనైనా గెలుస్తుందా.. అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. క్లీన్ స్వీపే లక్ష్యంగా మరో ధనాధన్ పోరాటానికి రెడీ అయింది కోహ్లీ సేన. ఇవాళ ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఆఖరి టీ20 జరగనుంది. 4–0 తేడాతో ఇప్పటికే సిరీస్ ను ఖాతాలో వేసుకున్న భారత్ మరో విజయం సాధించి కివీస్ ను వారి గడ్డపై వైట్ వాష్ చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్ లో నైనా గెలిచి సొంత గడ్డపై అతి పెద్ద ఓటమిని తప్పించుకోవాలని కివీస్ ఆరాట పడుతోంది.

ఫైనల్ ఎలెవెన్ సెలెక్షన్ విషయంలో టీమిండియాకు ఎలాంటి ఇబ్బందుల్లేవు. ఐతే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని లాస్ట్ మ్యాచ్ లాగే  బెంచ్ కు మరోసారి చాన్స్ ఇచ్చే అవకాశముంది. అయితే రిషబ్ పంత్ కు చాన్సిస్తారా లేదా అనేది ఆసక్తి పెంచుతోంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ రెస్ట్ తీసుకుంటే రోహిత్ కెప్టెన్సీ చూసుకుంటాడు. ఇక, ఆస్ట్రేలియా సిరీస్ నుంచి ప్రతీ మ్యాచ్ ఆడుతున్న రాహుల్ కి కూడా రెస్ట్ ఇవ్వొచ్చు. రాహుల్  బ్రేక్ ఇస్తే సంజు శాంసన్ తో పాటు పంత్ కూడా ఫైనల్ ఎలెవెన్ లో ఉంటాడు. ఇక శివమ్ దూబే ఆలస్యం చేయకుండా నిరూపించుకోవాల్సి వుంది. వన్డే సిరీస్ లో జడేజాతో పాటు కుల్దీప్ కూడా మరోసారి బెంచ్ కే పరిమితం కావొచ్చు. చహల్, సుందర్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. పేస్ కోటాలో ఠాకూర్ , సైనీ కొనసాగనుండగా ఈ మ్యాచ్ లో బుమ్రాకు రెస్ట్ ఇచ్చి షమీని తీసుకునే చాన్సుంది.

జట్టుగా న్యూజిలాండ్ బలంగానే కనిపిస్తున్నామ్యాచ్ లు గెలవలేకపోతుంది. నాలుగో మ్యాచ్ కు దూరమైన కెప్టెన్ కేన్ విలియమ్స్  ఫైనల్ టీ20 ఆడడం డౌట్ గానే ఉంది. కేన్ ఫిట్ నెస్ సాధించినా వన్డే సిరీస్ నేపథ్యంలో అతన్ని ఈ మ్యాచ్ కు దూరంగా ఉంచే చాన్స్ ఉంది. దీంతో లాస్ట్ మ్యాచ్ ఆడిన జట్టుతోనే కివీస్ బరిలోకి దిగుతుంది. కొలిన్ మన్రో, టిమ్ సీఫర్ట్ ఫామ్ లోకి రావడం కివీస్ కు కలిసొచ్చే అంశం. బేస్ ఓవలో అదిరిపోయే రికార్డున్న మన్రో ఈ మ్యాచ్ లో కీలకం కానున్నాడు. అయితే ఫినిషర్లు లేకపోవడం జట్టుకు సమస్యగా మారింది. గప్టిల్, రాస్ టేలర్ స్థాయికి తగ్గట్టు ఆడాలని మేనేజ్మెంట్ కోరుకుంటుంది. ఫైనట్ టీ20 లో భారీ స్కోర్లు రికార్డయ్యే చాన్సుంది. ఈ గ్రౌండ్ లో ఐదు మ్యాచ్ లు జరగ్గా అన్నింటిల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది.