
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓటు హక్కు పొందేందుకు ఈ నెల 11 తేదీ వరకే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ తెలిపారు. శనివారం సాయంత్రం వరకు అందిన దరఖాస్తులనే అధికారులు పరిశీలించి అర్హులను ఓటరు జాబితాలో చేర్చి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఓటు హక్కు అవకాశం కల్పిస్తారని చెప్పారు.
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అర్హులై ఉండి ఓటరు గా నమోదు కాని వారు శనివారం ( ఈ నెల 11) వ తేదీలోగా ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు.