ఎల్బీ నగర్, వెలుగు: హైదరాబాద్ ఎల్బీనగర్లోని సరూర్ నగర్ స్టేడియంలో ఆదివారం మాలల రణభేరి మహాసభ జరగనుంది. సభ ఏర్పాట్లను మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. మహాసభకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ప్రభుత్వ పెద్దలు హాజరవుతారని తెలిపారు.
సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా 2011 జనాభా లెక్కలతో సరైన ఎంపరికల్ డేటా లేకుండానే కులాల వారీగా చేసిన ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. రోస్టర్ పాయింట్ల కేటాయింపును పునఃసమీక్షించి జీవో 99ని సవరించి మాలలతో పాటు గ్రూప్ 3 లో ఉన్న మరో 25 కులాలకు న్యాయం చేయాలన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్ శాతాన్ని వెంటనే పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
