బామ్మ ర్ది మరణ వార్త విని..గుండెపోటుతో బావ మృతి

బామ్మ ర్ది మరణ వార్త విని..గుండెపోటుతో బావ మృతి

తాడ్వాయి, వెలుగు: బావమరిది ప్రమాదంలో మృతిచెందాడని తెలిసి గుండెపోటుకు గురై బావ మృతిచెందాడు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సింగాపురం గ్రామానికి చెందిన ముస్కె ఎల్లయ్య(50) కుటుంబంతో సహా బతుకుదెరువు కోసం హైదరాబాద్‌‌కు వెళ్లి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లెకు చెందిన తన బామ్మర్ది గుంపుల మనోహర్ మంగళవారం స్వగ్రామంలో బైక్​పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో స్పాట్​లో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎల్లయ్య తీవ్ర దిగ్భ్రాంతికి గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు సమీప దవాఖానకు తరలించగా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఎల్లయ్య మృతదేహాన్ని స్వగ్రామం నర్సింగాపురానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.