
అబుదాబి: పంజాబ్‌పై ‘రికార్డు’ విజయం తర్వాత వరుసగా విఫలమవుతున్న రాజస్తాన్ రాయల్స్.. ఐపీఎల్లో మరో పోరుకు సిద్ధమైంది. మంగళవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో బలమైన ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. స్టార్లు లేకున్నా డొమెస్టిక్ కుర్రాళ్లతో రాయల్స్ బలంగా ఉంది. కానీ ఇప్పుడు వాళ్లే బలహీనతగా మారడంతో లైనప్‌లో మార్పులు చేయాలని కెప్టెన్ స్మిత్ భావిస్తున్నాడు. అదే జరిగితే యశస్వి జైస్వాల్‌కు చాన్స్ దక్కొచ్చు. టాప్‌లో శాంసన్‌పై భారం వేసి మిడిలార్డర్‌ను బలోపేతం చేసేందుకు స్మిత్ లైనప్‌లో కిందకు రావాలని భావిస్తున్నాడు. బట్లర్ వైఫల్యం కూడా టీమ్‌కు ప్రతికూలంగా మారింది. బౌలింగ్‌లో ఉనాద్కట్‌ను వద్దనుకుంటే వరుణ్ ఆరోన్ లేదా కార్తీక్ త్యాగిని పరీక్షించి చూడొచ్చు. మరోవైపు బెంగళూరుతో మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో నిరాశపర్చినా.. లాస్ట్ రెండు మ్యాచ్‌ల్లో ముంబై బాగా పుంజుకుంది. ముంబై బ్యాటింగ్‌లో ఎలాంటి సమస్యల్లేవు. కెప్టెన్ రోహిత్ టచ్‌లో ఉండగా, డికాక్ గాడిలో పడ్డాడు. ఇషాన్ కిషన్ అంచనాలను మించిపోతున్నాడు. పొలార్డ్, హార్దిక్ స్లాగ్ ఓవర్లలో చెలరేగుతున్నారు. లాస్ట్ మ్యాచ్‌లో క్రునాల్ కూడా సత్తా చాటాడు. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్‌కు తోడు ప్యాటిన్సన్ కూడా చెలరేగిపోతున్నాడు. ఏకైక స్పిన్నర్‌గా క్రునాల్ ఫర్వాలేదనిపిస్తున్నాడు.