
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రి మండలి బుధవారం సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోదం తెలుపడానికి ఈ నెల 18, 19 తేదీల్లో అసెంబ్లీని సమావేశపర్చుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త చట్టానికి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. పురపాలనను సమగ్ర ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం నూతన అర్బన్ పాలసీని రూపొందించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హైదరాబాద్ నగర కార్పొరేషన్‌కు ప్రత్యేక చట్టాలను తెస్తున్నారు. హెచ్‌ఎండీఏతో పాటు నగరపాలక సంస్థల అభివృద్ధి మండళ్ల చట్టాన్ని సవరించి కొత్త చట్టం రూపొందించారు. వీటికి మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలుపనుంది.