హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని భూ సమస్యల పరిష్కారం కోసం టీశాట్ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీ-శాట్ 'నిపుణ' చానల్‌లో బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు లైవ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు.
కార్యక్రమంలో భూ రికార్డులపై అవగాహన కలిగిన న్యాయ నిపుణులు భూమి సునీల్ కుమార్ పాల్గొంటారని, సమస్యలపై సలహాలు, -సూచనలు అందచేస్తారని వివరించారు. భూ సమస్యలపై సలహాలు, -సూచనల కోసం 040 23540326, 23450726, టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 4039 కు కాల్ చేయాలని సీఈవో సూచించారు.
