
దసరా పండుగ ముగియడంతో ఆందోళనను మరింత ఉధృతం చేసే ప్రయత్నాల్లో ఉంది ఆర్టీసీ కార్మికసంఘాల జేఏసీ. ఆర్టీసీ సమ్మెపై ఇవాళ అఖిలపక్ష సమావేశం జరగనుంది. జనసమితి అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే దాదాపు అన్ని పార్టీలు కార్మికసంఘాలకు అండగా ఉంటామని చెప్పాయి. దీంతో ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఆర్టీసీ కార్మికుల ఆందోళనల జోరు మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.