ఇవాళ్టి కాకతీయ ఉత్సవాలు రద్దు

ఇవాళ్టి కాకతీయ ఉత్సవాలు రద్దు
  • జపాన్ ప్రధాని మృతికి సంతాపంగా ఇవాళ జరగాల్సిన వేడుకలు రద్దు

వరంగల్: ఇవాళ్టి కాకతీయ వైభవ సప్తాహం వేడుకలు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. జపాన్ మాజీ ప్రధాని షంజో అబే మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇవాళ సంతాప దినంగా ప్రకటించడంతో ఇవాళ్టి వేడుకలను రద్దు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ ప్రధాని షింజో అబేను పశ్చిమ జపాన్ లోని నరా సిటీలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా.. దుండగుడు వెనుకవైపు నుంచి జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. భారతదేశానికి ముఖ్యంగా మోడీకి సన్నిహితుడిగా పేరుగాంచిన షిజో అంబే మృతికి నివాళులుగా... ఇవాళ శనివారం దేశ వ్యాప్తంగా సంతాప దినంగా పాటిస్తున్నారు. 
మొన్నఅంటే గురువారం కాకతీయ వైభవ సప్తాహం వేడుకలు వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్ర సర్కార్ కాకతీయ ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. 700 ఏండ్ల తర్వాత వచ్చిన కాకతీయ వంశస్థుడు, కాకతీయుల 22 వారసుడు చత్తీస్‍గఢ్‍ రాష్ట్రం బస్తర్‍ మహారాజ్‍ కమల్‍చంద్ర భంజ్‍దేవ్‍ కు కనివినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికారు. తన పూర్వీకుల రాజధాని  ఓరుగల్లుకు వచ్చిన కమల్ చంద్ర భంజ్ దేవ్ కు రాష్ట్ర మంత్రులు ఘనస్వాగతం పలికి ఓరుగల్లు చరిత్రలో సరికొత్త ఘట్టం ఆవిష్కృతం చేశారు.

పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి తదితరుల ఆధ్వర్యంలో రథంపై ఊరేగించి పూల వర్షం కురిపించారు. నెత్తిన కిరీటం.. చేతిలో ఖడ్గంతో వచ్చిన కమల్ చంద్ర భంజ్ దేవ్ కు రాజుల తరహాలోనే స్వాగతం పలికారు. సాహరే బాహుబలి పాటలతో అపూర్వమైన స్వాగతం పలకిన సరికొత్త అనుభూతిని కలిగించింది. ఓరుగల్లు చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని.. పూర్వ వైభవం గుర్తుకొచ్చేలా నిర్వహిస్తున్న ఉత్సవాలను ఇవాళ శనివారం మూడో రోజు కార్యక్రమాలను సంతాప దినం కారణంగా రద్దు చేశారు.