తాటి ముంజల జ్యూస్ భలే టేస్టీ

తాటి ముంజల జ్యూస్ భలే టేస్టీ

వేసవిలో మాత్రమే దొరికే  తాటిముంజల జ్యూస్​ భలే టేస్టీగా ఉంటుంది. అతి తక్కువ ఇంగ్రెడియెంట్స్​తో చేసే ఈ జ్యూస్​ వేసవి వేడితో పాటు డైజెషన్​ సమస్యల్ని కూడా తగ్గిస్తుంది. నీటిశాతం ఎక్కువగా ఉండే తాటిముంజల్లో ఫైబర్, ప్రొటీన్​తో పాటు విటమిన్​– ఎ, సి, ఇ , కె కూడా ఉంటాయి. ఇన్ని లాభాలున్న ఈ జ్యూస్​ని ఇంట్లోనే చేసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. 

కావాల్సినవి
తాటిముంజలు– నాలుగు
పాలు– ఒక లీటరు
చక్కెర– పావు కప్పు
నిమ్మరసం– ఒక టీ స్పూన్​
పుదీనా– కొద్దిగా, ఐస్​క్యూబ్స్​– తగినన్ని 
అల్లం రసం– ఒక టీ స్పూన్​

తయారీ

తాటి ముంజల పొట్టు తీసి మిక్సీ జార్​లో వేయాలి. అందులో చక్కెర, పుదీనా, కొన్ని పాలు, ఐస్​ క్యూబ్స్​ వేసి మిక్సీ పట్టాలి. జ్యూస్​లా అయ్యాక  మిగిలిన పాలు పోసి మరోసారి మిక్సీ పట్టి, సర్వింగ్​ బౌల్​లోకి తీసుకోవాలి. చివరిగా నిమ్మ, అల్లం రసం కలుపుకుని పుదీనాతో గార్నిష్​ చేసుకొని తాగితే  టేస్టీగా ఉంటుంది.