ఒలింపిక్స్ కు 10 వేల మందికి అనుమతి

ఒలింపిక్స్ కు 10 వేల మందికి అనుమతి

జులై 23న టోక్యో ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కావాల్సి ఉన్నాయి. ఒలింపిక్స్‌ను అభిమానులు లేకుండానే నిర్వహించాలన్న జపాన్ ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య సలహాదారు డాక్టర్ షిగెరె ఓమి సూచనను నిర్వాహకులు పట్టించుకోలేదు. స్థానిక అభిమానుల మధ్య గేమ్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి ఒలింపిక్ వేదికలో 50 శాతం సామర్థ్యం లేదా గరిష్టంగా 10 వేల మంది అభిమానులను అనుమతించాలని సోమవారం నిర్ణయం తీసుకున్నారు. స్టేడియాల్లో అల్లరి చేయకూడదని.. కచ్చితంగా మాస్కులు ధరించాలని, గేమ్స్ చూసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లాలనే నిబంధనలు విధించారు. ఒలింపిక్స్ కోసం మొత్తం 37 లక్షల టికెట్లు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.