వెంకటాపురం, వెలుగు: వరదలతో సంబంధించి ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురైతే జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన 1800-425-7109 టోల్‌ఫ్రీకి సమాచారం అందించాలని ములుగు కలెక్టర్ హేమంత్సహదేవరావు సూచించారు. 24 గంటలూ ఈ సేవ అందుబాటులో ఉంటుందని, ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపడతారని తెలిపారు.
గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు చేపల వేట, ఈత వంటి కార్యకలాపాలకు నదులు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు మినహా రానున్న రెండు, మూడు రోజుల పాటు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.
