ఓటర్ల సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1950

ఓటర్ల సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1950

లోక్ సభ ఎన్నికల సందర్భంగా…ఓటర్లు తమ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎన్నికల కమిషన్‌ టోల్ ఫ్రీ నెంబర్ 1950 ను ప్రారంభించింది. దీనికి ఫోన్ చేసి ఓటర్లు వారికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే 9223166166 నంబరుకు SMS చేయవచ్చంది. ఓటరు తన ఎపిక్‌ కార్డు నంబరు టైప్‌ చేసి SMS చేస్తే వెంటనే పోలింగ్‌ స్టేషన్‌ సమాచారం తెలుస్తుంది. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ECI) రూపొందించిన నా ఓట్‌ యాప్‌ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.