దేశంలోని వాహనదారులకు మరో షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు పెంచనున్నది. ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీలు మారే అవకాశాలు కనిపిస్తోంది.
దేశంలోని వాహనదారులకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ప్రయాణించే ప్రజలు వచ్చే నెల నుంచి మరింత ఎక్కువ చెల్లించాల్సి రాబోతోంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (National Highway Authority of India - NHAI) టోల్ ట్యాక్సులను భారీగా పెంచనుంది. ఈ టోల్ ధరలు సుమారు 5 శాతం నుంచి 10 శాతం మేర పెరగనున్నాయని సమాచారం. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న క్రమంలో టోల్ ఛార్జీలు పెంచడం వాహనదారులపై మరింత భారం మోపడమేనని ట్రావెలర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టోల్ ట్యాక్స్ పాలసీ..
నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008 ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ధరలు సవరించాల్సి ఉంటుంది. అవసరాలను బట్టి సమయానుసారంగా టోల్ సమస్యలపై పాలసీ (Toll Tax Policy) నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది ప్రభుత్వం. మార్చి చివరి వారంలో రహదారుల అథారిటీ చేసే సిఫార్సులను ఉపరితల రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పరిశీలించి ఏప్రిల్ 1న ప్రకటన చేయనుంది.
అధికారవర్గాల సమాచారం ప్రకారం కార్లు (Cars), లైట్ వేట్ వెహికిల్స్‌కు టోల్ ఛార్జీలు (Toll Charges) 5 శాతం మేర పెంచే అవకాశాలు ఉన్నాయి. అలాగే హెవీ వాహనాలకు 10 శాతం పెంచనున్నారని తెలుస్తోంది. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన డిల్లీ- ముంబయి ఎక్స్‌ప్రెస్ వేకు సైతం టాలో రేట్లను పెంచనుంది కేంద్రం. ప్రస్తుతం డిల్లీ-ముంబాయి ఎక్స్‌ప్రెస్ వేపై కిలోమీటర్‌కు రూ.2.19 వసూలు చేస్తున్నారు. దానిని మరో 10 శాతం పెంచనున్నారు. దీనిపై వాహనాల సంఖ్య సైతం పెరుగుతోంది. ప్రతి రోజు 20 వేల వాహనాలు వెళ్తున్నట్లు సమాచారం. అది వచ్చే ఆరు నెలల్లో 60 వేలకు చేరే అవకాశాలు ఉన్నాయి.
నెల వారీ పాసులు సైతం పెంపు..
టోల్ గేట్ ప్రాంతానికి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలకు నెలవారీ పాసులు ఇస్తుంటారు. ఇప్పుడు వాటి ఛార్జీలు సైతం దాదాపు 10 శాతం పెంచే ఆలోచనలో ఉంది కేంద్రం. నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008 ప్రకారం టోల్ గేటుకు సమీపంలో ఉన్న వారికి సైతం ఎలాంటి మినహాయింపులు లేవు. అయితే, 2022-23 ఆర్థిక ఏడాదిలో అన్‌లిమిటెడ్ ట్రిప్పులతో నెలకి రూ.315తో పాసులు ఇచ్చారు. ఇప్పుడు పాసుల ధరలు సైతం పెంచనున్న నేపథ్యంలో నిత్యం టోల్ గేట్ ద్వారా సొంత పనులకు వెళ్లన వారికి మరింత భారం కానుంది.
గతేడాది కూడా టోల్‌ను పెంచారు
టోల్ ప్లాజాపై పన్ను పెంచే నిబంధన లేదని టోల్ యాజమాన్యం చెబుతోంది. జూలై 2022లో టోల్ ట్యాక్స్ కూడా పెంచబడింది. కార్, జీపు పన్ను రూ. 95 నుండి రూ. 110కి, బస్-ట్రక్కు రూ. 335 నుండి రూ. 385కి, మల్టీ-యాక్సిల్ వాహనంపై రూ. 585 నుండి రూ. 620 రూపాయలకు పెంచబడింది. స్థానిక పన్నును కూడా రూ. 20 నుంచి రూ. 25 రూపాయలకు పెంచారు. టోల్ కంపెనీతో సంబంధం ఉన్న వ్యక్తులను వివరణ కోరగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా టోల్ కూడా పెరిగిందని సమాధానం ఇచ్చారు.
ఈ రేట్లు రికవరీ చేయబడతాయి
టోల్ కంపెనీ నుంచి అందిన ప్రతిపాదిత రేట్ల ప్రకారం ఇప్పటి వరకు కార్-జీప్ రూ. 110, బస్-ట్రక్ రూ. 385, మల్టీ యాక్సిల్ వెహికల్ రూ. 620, లోకల్ ట్యాక్స్ రూ.25 వసూలు చేశారు. అయితే జూలై 1 నుంచి కారు-జీప్ రూ. 120, ట్రక్-బస్రూ. 400, మల్టీ-యాక్సిల్ వాహనం రూ. 650, స్థానిక పన్ను రూ. 30 వసూలు చేసే యోచనలో ఉంది.
