HBD Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకి టాలీవుడ్ ప్రముఖుల బర్త్డే విషెస్

HBD Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకి టాలీవుడ్ ప్రముఖుల బర్త్డే విషెస్

ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు(Mahesh Babu). ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు (ఆగస్ట్ 9న) శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్లు చేశారు. 

అందులో భాగంగా మహేష్ బాబుకు ఎన్టీఆర్‌ తెలిపిన బర్త్‌ డే విషెష్ కి ఇరువైపుల ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ అన్నా!! ఈ ఏడాది అంతా మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను" అంటూ చేసిన పోస్ట్ సినీ ఆడియన్స్ను ఆకర్షిస్తుంది. మహేష్ బాబును అన్నా అంటూ సంభోదిస్తూనే..అంతా మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నా అని తెలపడం..ఒకరంటే ఒకరికి ఎంత ఇష్తమో..ఎలాంటి బంధమో చూపిస్తుంది. టాలీవుడ్లో వీరిద్దరూ బిగ్ స్టార్స్ అయినప్పటికీ..వీరి మధ్య ఇలాంటి ప్యూర్ నేచర్ ఉండటంతో ఫ్యాన్స్ గర్వపడుతున్నారు. 

అలాగే విక్టరీ వెంకటేష్ కూడా తనదైన శైలిలో విషెష్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్నోడా..ఎల్లప్పుడూ ప్రేమ, నవ్వు మరియు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అంటూ కలిసి దిగిన ఫోటో షేర్ చేశారు. 

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి విషెష్ చేస్తూ..విష్ మై డియర్..సూపర్ స్టార్ మహేష్ బాబు మెనీ హ్యాపీ రిటర్న్స్!!!" అంటూ తెలిపారు.

అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ "లాంగ్ లివ్ సూపర్ స్టార్..ది మ్యాన్ ఆఫ్ హార్ట్స్..ది మ్యాన్ ఫర్ హార్ట్స్..మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ డియర్ బ్రదర్" అంటూ మహేష్ సేవలను గుర్తు చేశారు.

హీరో సుధీర్ బాబు విషెస్ చెబుతూ..'మీకు బోలెడంత ప్రేమ, నవ్వు మరియు విజయాన్ని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ..హ్యాపీ బర్త్‌డే మహేష్..హీరోగా ఉంటూనే సమాజ సేవను కొనసాగిస్తూ ప్రజలను సంతోషపెట్టడం కొనసాగించండి' అని తెలిపాడు.

ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మేకర్స్, పలు హీరోల ఫ్యాన్స్ విషెష్ చెబుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేపిస్తూ మనుషులలో దేవుడిగా మారిన ప్రిన్స్ మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. చివరగా దైవం మహేష్ రూపేణ!!