
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో వైరల్ అయింది. ఎలాంటి ఆదారం లేకుండా గాల్లో ఆసనాలు వేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో అతను గాలిలో ఆసనాలు వేసినట్టుగా ఉంది. దీంతో పాటు ఇది ఫోటోషాప్ ఎఫెక్ట్ కాదు నన్ను నమ్మండని కామెంట్ చేశారు సుధీర్ బాబు. అయితే నెటిజన్లు మాత్రం సుధీర్ ఫొటోను నమ్మడంలేదు. రాత్రికి రాత్రే మంత్రాలు ఏమైనా నేర్చుకున్నారా అని అంటున్నారు. ఇందుకు జవాబుగా.. ఇందులో మాయలు మంత్రాలు లేవని.. గాల్లో ఎగురుతూ రకరకాల ఆసనాలు చాలా సార్లు ప్రయత్నించానని అందులో ఈ రెండు ఫొటోలు బాగా వచ్చాయని చెప్పుకొచ్చారు.
Believe me … No Photoshop involved ?? #JustAJump ? pic.twitter.com/t0xQFfpyVe
— Sudheer Babu (@isudheerbabu) January 2, 2020