అందరి దృష్టీ ‘శాకుంతలమ్’ పైనే

అందరి దృష్టీ ‘శాకుంతలమ్’ పైనే

‘జాను’ మూవీ తర్వాత సమంత నుంచి సినిమాలు కాస్త తక్కువగానే వస్తున్నాయి. మధ్యలో ‘పుష్ప’ పాటతో పలకరించింది. ఆ తర్వాత ‘కణ్మణి రాంబో ఖతీజా’తో వచ్చినా.. అదంత విజయం సాధించలేదు. దాంతో అందరి దృష్టీ ‘శాకుంతలమ్’ పైనే ఉంది. ఇలాంటి సినిమాలు తీయడంలో గుణశేఖర్ ఎక్స్‌‌‌‌పర్ట్ కావడం, సమంత మొదటిసారి పౌరాణిక పాత్రలో నటిస్తూ ఉండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ మూవీ నుంచి ఒకట్రెండు తప్ప అంతగా అప్‌‌‌‌డేట్స్ రాలేదు. దాంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.

నెక్స్ట్ అప్‌‌‌‌డేట్ ఎప్పుడు అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు. దాంతో నిర్మాతల్లో ఒకరైన నీలిమ గుణ రియాక్టయ్యారు. ‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. సీజీ వర్క్‌‌‌‌కి కాస్త ఎక్కువ టైమ్ పడుతోంది. బెస్ట్ ఔట్‌‌‌‌పుట్ ఇవ్వాలనే లక్ష్యంతో కాంప్రమైజ్ కాకుండా పని చేస్తున్నాం. అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం’ అన్నారామె. త్వరలోనే మరిన్ని అప్‌‌‌‌డేట్స్ ఇస్తామని కూడా చెప్పారు. అంటే శకుంతలగా సమంతని చూడటానికి మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందేనని అర్థమవుతోంది. సమంత మాత్రం ఈ సినిమాకి సంబంధించి తన పనులన్నీ పూర్తి చేసి ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. యశోద, ఖుషి చిత్రాలతో పాటు ‘సియాటెల్’ వెబ్ సిరీస్‌‌‌‌లోనూ నటిస్తోంది సామ్.