చిరంజీవి కంటే నా రెమ్యునరేషన్ 5 రేట్లు ఎక్కువ.. అంతా మారిపోయింది.

చిరంజీవి కంటే నా రెమ్యునరేషన్ 5 రేట్లు ఎక్కువ.. అంతా మారిపోయింది.

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. చంద్రమోహన్ ను ఇద్దరు కుమార్తెలు. ఒకరు అమెరికాలో సెటిల్ అవగా.. మరొకరు చెన్నై లిల్ స్థిరపడ్డారు. అమెరికా నుండి కూతురు రావాల్సివుండటంతో చంద్రమోహన్ అంత్యక్రియలు నవంబర్ 13న హైదరాబాద్ లో జరుపనున్నారు. 

ఇక చంద్రమోహన్ మరణవార్తతో అభిమానులు ఆయన గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో చంద్రమోహన్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అవేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి, చంద్రమోహన్ చాలా సినిమాల్లో కలిసి నటించారు. ప్రాణం ఖరీదు, తాయారమ్మ బంగారయ్య వంటి సినిమాల్లో ఈ ఇద్దరు కలిసి నటించారు. అయితే.. ఒకానొక సమయంలో చిరంజీవి కంటే చంద్రమోహన్ రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండేదట.

ఈ విషయం గురించి చంద్రమోహన్ మాట్లాడుతూ..  ప్రాణం ఖరీదు సినిమా కోసం చిరంజీవిలో 5 వేలు ఇస్తే.. నాకు 25 వేలు ఇచ్చారు. పని పట్ల చిరంజీవి చాలా శ్రద్ధగా ఉండేవాడు. అతనిలో ఏదైనా చేయాలనే కసి కనిపించేది. డాన్స్ లలో తనకంటూ ప్రత్యేకమైన శైలీని కనబరుచుకున్నారు. ఆతరువాత అంతా మారిపోయింది. అందుకే ఇపుడు ఆయన ఈ స్థాయిలో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు చంద్రమోహన్.