టమాటా రైతులకు మంచి రోజులు మరికొన్ని రోజులే.. అక్కడి నుంచి దిగుబడి పెరిగింది

టమాటా రైతులకు మంచి రోజులు మరికొన్ని రోజులే.. అక్కడి నుంచి దిగుబడి పెరిగింది

టమోటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. ఒక్కసారిగా టమోటా ధర కొండెక్కి కూర్చుంది. ఇప్పుడు దేశంలో పలు ప్రాంతాల్లో టమోటా రేటు డబుల్ సెంచరీ దాటేసింది. అంటే 200 రూపాయిలు  దాటిపోయింది. దీని వల్ల సామన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పుకోవచ్చు. దీంతో ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్నారు. త్వరలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్  రాష్ట్రాల నుంచి దేశ వ్యాప్తంగా టమోటాను దిగుమతి చేసుకోవడంతో ధరలు తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం  టమోగా ధర విపరీతంగా పెరగడంతో ఆ పంటను సాగు చేసేందుకు రైతులు ఆశక్తి చూపుతున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టమోటా ధర భారీగాపెరిగిందన్నారు.  పలు రాష్ట్రాల్లో సబ్సిడీపై టమోటాను విక్రయిస్తున్నట్లు కేంద్ర  ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే  తెలిపారు. 

నాసిక్, నార్యంగావ్,  ఔరంగాబాద్ బెల్ట్  ప్రాంతాల నుంచి టమోటా పంట దిగుమతి కావడంతో ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల కారణంగా   హర్యానా ,  హిమాచల్ ప్రదేశ్‌లలో టమోటా పంటలను ప్రతికూలంగా మారిందని ఆయన తెలిపారు. టమోటా ధరను  అందుబాటులోకి తీసుకురావడానికి, ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వివరించారు.  ప్రజలకు  సబ్సిడీ ధరతో విక్రయిస్తున్నారు.  నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF) ,  నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (NAFED) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక  మహారాష్ట్రలోని మండిల నుండి  టమోటాలను కొనుగోలు చేసి, వాటిని ఢిల్లీ-NCR, బీహార్‌ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు.  మరి టమోటా సామాన్యులకు ఎప్పుడు  అందుబాటులోకి వస్తుందో వేచి చూడాలి.