OTT Movies: ఈ వారం (మే 5-10) ఓటీటీల్లో కొత్త సినిమాలు.. డిఫెరెంట్ జోనర్స్లో 4 స్పెషల్.. ఎక్కడ చూడాలంటే?

OTT Movies: ఈ వారం (మే 5-10) ఓటీటీల్లో కొత్త సినిమాలు.. డిఫెరెంట్ జోనర్స్లో 4 స్పెషల్.. ఎక్కడ చూడాలంటే?

మనకున్న వివిధ ఓటీటీల్లోకి కొత్త సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఇపుడు ప్రతివారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల హవా పెరుగుతూనే ఉంది. వేటికవే భిన్నంగా తెరెకెక్కి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. కొన్ని డైరెక్ట్ ఓటీటీల్లోకి ఎంట్రీ ఇస్తుంటే, మరికొన్ని థియేటర్స్కి వచ్చాక వస్తున్నాయి.

అలా ఈ వారం (మే 5 నుంచి 10వరకు) ఓటీటీల్లో కొన్ని కొత్త  సినిమాలు రానున్నాయి. వాటిలో డ్రామా, హారర్ థ్రిల్లర్ తో పాటు రొమాంటిక్ యాక్షన్ మూవీస్ ఉన్నాయి. మరి అందులో చూడాల్సిన మన తెలుగు సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్నాయనేది ఓ లుక్కేద్దాం.  

రాబిన్‍హుడ్ ఓటీటీ:

నితిన్, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్‍హుడ్ (Robinhood). కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీని వెంకీ కుడుముల తెరకెక్కించాడు. భారీ అంచనాలతో మార్చి 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది.

దాదాపు రూ.29 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. నితిన్ కెరీర్లో మరో డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో రాబిన్‍హుడ్ ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైంది.

రాబిన్‍హుడ్ ఓటీటీ హక్కులను Zee5 ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానల్ సొంతం దక్కించుకుంది. నితిన్ కెరీర్లో భారీ బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులు మంచి ధరకు అమ్ముడయ్యాయి. 

ఇప్పుడీ మూవీ ఓటీటీలో, టీవీలో ఒకే రోజు స్ట్రీమింగ్ కాబోతుంది. మే 10నుంచి జీ5 ఓటీటీతో పాటు జీ తెలుగు ఛానల్లో ఈ మూవీ వచ్చేస్తుంది. మే 10 సాయంత్రం నుంచి జీ5లో వీక్షించొచ్చు. 

 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఓటీటీ:

స్టార్ హీరో అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ సుమారు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి సూపర్ హిట్ ఖాతాలో చేరింది. అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 8 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. 

‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’ ఓటీటీ:

టీవీ యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన రెండో మూవీ ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’. దీపికా పిల్లి హీరోయిన్.  జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షో క్రియేట‌ర్స్ నితిన్, భరత్ దర్శకత్వం వచించారు. మాంక్స్ అండ్ మంకీస్ సంస్థ నిర్మించిన ఈ మూవీ 2025 ఏప్రిల్ 11న గ్రాండ్‌గా రిలీజైంది.

►ALSO READ | సుహాస్ కోలీవుడ్​ఎంట్రీ: స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఫస్ట్ లుక్ రిలీజ్

ఈ కామెడీ డ్రామా థియేటర్లో ప్రేక్షకులను బాగానే నవ్వించింది. కానీ ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈమూవీ మే 8నుంచి ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

‘గ్రామ్‌ చికిత్సాలయ్‌’ ఓటీటీ:

కామెడీ వెబ్‌ సిరీస్‌లలో ‘పంచాయత్‌’ఫ్రాంచైజీకు అంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఓటీటీ కంటెంట్‌ అంటే క్రైమ్‌, అడల్ట్‌ సీన్స్‌ కంపల్సరీ అని భావిస్తున్న సమయంలో వాటన్నింటికీ భిన్నంగా సింపుల్‌స్టోరీతో ఫ్యామిలీ అంతా కలిసి చూస్తూ హాయిగా నవ్వుకునేలా చేసింది ‘పంచాయత్‌’సిరీస్‌.

ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో మూడు భాగాలు రావడంతో పాటు తెలుగులో ‘సివరపల్లి’ పేరుతో రీమేక్ అయింది. ఇప్పుడిక ఈ వెబ్‌ సిరీస్‌ మేకర్స్‌ నుంచి ‘గ్రామ్‌ చికిత్సాలయ్‌’ అనే మరో సిరీస్‌ వస్తోంది. ఇది మే 9నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ‘పంచాయత్‌’తెరకెక్కించిన దీపక్ కుమార్ మిశ్రా క్రియేటర్‌‌గా వ్యవహరిస్తుండగా రాహుల్ పాండే దర్శకుడు.