సుహాస్ కోలీవుడ్​ఎంట్రీ: స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఫస్ట్ లుక్ రిలీజ్

సుహాస్ కోలీవుడ్​ఎంట్రీ: స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఫస్ట్ లుక్ రిలీజ్

విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సుహాస్.. తమిళ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘మండాడి’. సూరి లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తున్న ఈ చిత్రంలో మరో లీడ్‌‌‌‌గా సుహాస్  నటిస్తున్నాడు. మతిమారన్ పుగళేంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో  ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌‌‌‌మెంట్‌‌‌‌ సంస్థ నిర్మిస్తోంది. 

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి సుహాస్  ఫస్ట్ లుక్‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సుహాస్  ఇంటెన్స్ లుక్‌‌‌‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు. లుంగీపైకి కట్టి,  నెరిసిన జుట్టుతో,  సునామీ రైడర్స్ అని ఉన్న జెర్సీ వేసుకుని సముద్ర తీరంలో ఉన్న సుహాస్ లుక్ ఆకట్టుకుంటోంది. 

మహిమా నంబియార్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న  ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ ఇతర   పాత్రల్లో కనిపించనున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో బలమైన ఎమోషన్స్ ఉంటాయని మేకర్స్ చెప్పారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.