ఓటు కోల్పోయినోళ్లకు సాయం చేయండి... బిహార్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సుప్రీంకోర్టు ఆదేశం

ఓటు కోల్పోయినోళ్లకు సాయం చేయండి... బిహార్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: బిహార్​లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) వల్ల ఓట్లు కోల్పోయిన వారికి సాయం అందించాలని బిహార్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ(బీఎస్ఎల్ఎస్ఏ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల సంఘానికి అప్పీల్ దాఖలు చేసేలా వారికి సహాయం చేయాలంది. ఇలాంటి వారి అప్పీల్స్ ను నిర్ణయించేందుకు అక్టోబర్ 16న విచారణ జరుగుతుందని, డిటెయిల్డ్ ఆర్డర్లు ఇవ్వాలని బెంచ్‌లో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీతో కూడిన ద్విసభ్య బెంచ్​చెప్పింది. 

అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఉన్నాయని పిటిషనర్ ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ రాకేష్ ద్వివేది తెలిపారు.  దీంతో స్పందించిన బెంచ్ ‘‘ఇలాంటివి మేం ఆశించలేదు’’ అని ఆగ్రహం తెలిపింది. అప్పీల్స్ కు ఏక వాక్య సంక్లిష్ల ఆర్డర్లు ఇవ్వకూడదని, పారా-లీగల్ వాలంటీర్ల జాబితా విడుదల చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

ఆ అడ్వకేట్లు ఏడీజేలుగా అర్హులే..  

ఏడేళ్ల ప్రాక్టీస్ పూర్తి చేసిన న్యాయవాదులు, సబార్డినేట్ జుడిషియరీ అధికారులు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిలుగా (ఏడీజే) నియమించేందుకు అర్హులే అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 233 ప్రకారం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఈ అర్హత ఉందని, రాష్ట్రాలు మూడు నెలల్లో హైకోర్టులతో కలిసి రూల్స్ సవరించాలని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఎమ్మెస్ సుందరేశ్, జస్టిస్​అరవింద్ కుమార్, జస్టిస్​ఎస్సీ శర్మ, జస్టిస్ కె వినోద్ చంద్రన్ తో కూడిన ఐదుగురు సభ్యుల బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది. కాన్‌స్టిట్యూషనల్ స్కీమ్ అన్వయాన్ని "ఆర్గానిక్"గా చేయాలని ఈ సందర్భంగా సీజేఐ పేర్కొన్నారు. 

సరోగసీ చట్టంలో వయసు పరిమితిపై కీలక తీర్పు 

సరోగసీ చట్టం2021 అమలులోకి వచ్చిన 2022 జనవరి 25వ తేదీ కంటే ముందు సరోగసీ ప్రక్రియ (ఎంబ్రియోలు సృష్టించి, ఫ్రీజ్ చేసినవారు) మొదలుపెట్టిన దంపతులకు అందులోని వయసు పరిమితుల (తల్లికి 23-–50, తండ్రికి 26-–55 ఏళ్లు) నిబంధనలు వర్తించవని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ సమయంలో వయసు నిబంధనలు లేనందున వారికి సరోగసీకి వెళ్లే హక్కు ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. సరోగసీ చట్టంలోని వయసు పరిమితి నిబంధనపై ముగ్గురు దంపతులు వేసిన పిటిషన్‌లపై ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 

చిన్నప్పటి నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం 

సెక్స్ ఎడ్యుకేషన్‌ను 9వ తరగతి నుంచి కాకుండా చిన్నప్పటి నుంచే ప్రవేశపెట్టాలని, హార్మోనల్ మార్పులపై అవగాహన కల్పించాలని సుప్రీం సూచించింది. హైయర్ సెకండరీ స్కూళ్లలో ఇది కరిక్యులమ్ భాగంగా ఉండాలని, పిల్లలు ప్యూబర్టీ మార్పులు, జాగ్రత్తలు తెలుసుకోవాలని జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్​ అలోక్ అరాధే బెంచ్ అభిప్రాయపడింది. IPC సెక్షన్ 376 (రేప్), 506 (క్రిమినల్ ఇంటిమిడేషన్), పొక్సో చట్టం కేసులో 15 ఏళ్ల బాలుడికి బెయిల్ మంజూరు సందర్భంగా ఈ సూచనలు చేసింది.