సీఎంఏలో టాప్ ర్యాంకులు.. ఇద్దరు మాస్టర్ మైండ్స్.. విద్యార్థులకు రాష్ట్రపతి సన్మానం

సీఎంఏలో  టాప్ ర్యాంకులు.. ఇద్దరు మాస్టర్ మైండ్స్.. విద్యార్థులకు రాష్ట్రపతి సన్మానం

హైదరాబాద్, వెలుగు: సీఎంఏ ఫైనల్ ఎగ్జామ్ ఫలితాల్లో  ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్స్ కామర్స్ ఇన్‌‌‌‌స్టిట్యూట్(గుంటూరు) విద్యార్థులు రిషబ్ ఓస్వాల్ ఆర్ (డిసెంబర్ 2024), కొత్తపేట తేజశ్విని (జూన్ 2024)లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా సన్మానం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌‌‌‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్ మైండ్స్ సంస్థ అడ్మిన్ అడ్వైజర్ సీఏ మట్టుపల్లి మోహన్ స్పందిస్తూ..మాస్టర్ మైండ్స్ స్టూడెంట్లు వివిధ కామర్స్ కోర్సుల్లో ఇప్పటివరకు 55 సార్లు ఫస్ట్ ర్యాంకులు సాధించారని తెలిపారు.

అయినప్పటికీ, ఒకే ఏడాదిలో సీఎంఏ ఫైనల్ స్థాయిలో ఇద్దరు విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం అరుదైన విజయమని ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉత్తమ ఫలితాలకు కృషి చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందం, నాన్-టీచింగ్ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా సన్మానం పొందడం మాస్టర్ మైండ్స్ సంస్థకు గర్వకారణమన్నారు. ఇది ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని..మాస్టర్ మైండ్స్ మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.