
చంద్రుడిపైకి రాకెట్‌ని ప్రయోగించి విఫలమైన రష్యన్స్కి మరో షాక్ తగిలింది. లూనా 25 స్పేస్‌క్రాఫ్ట్ తయారీలో కీలకంగా వ్యవహరించిన సైంటిస్ట్కుప్పకూలి ఆసుపత్రిపాలయ్యారు.
లూనా 25ను రష్యా ప్రయోగించగా నిర్దేశిత సమయంలో మాడ్యుల్లోని ఇంజిన్లు ఆఫ్కాకపోవడంతో అది చంద్రుడిపై కూలిపోయింది. ఈ ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన రష్యన్సైంటిస్ట్మిఖేయిల్మారోవ్(90) కుప్పకూలారు.
దీంతో ఆయన్ని వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయన మాస్కోలోని క్రెమ్లిన్ లో ఉన్న సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు. చికిత్స పొందుతున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లూనా 25 ఫెయిల్ కావడం తమకు పెద్ద ఎదురుదెబ్బ అని, తన ఆరోగ్యంపై దాని ప్రభావం పడిందని అన్నారు.
అది తన జీవితానికి చెందిన అంశమని, ఇలాంటి సమయాల్లో డాక్టర్స్ దగ్గర ఉండటమే మంచిదని పేర్కొన్నారు. దాని వైఫల్యం వెనక కారణాలు విశ్లేషించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మిషన్ రూపకల్పనలో తన జీవితాన్నే అర్పించిన అలాంటి వ్యక్తికి ఈ ఘటన తీరని లోటనే చెబుతున్నారు నిపుణులు.